News May 7, 2024

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే: అదానీ

image

ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బిలియనీర్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. ‘ఈరోజు నా కుటుంబంతో కలిసి ఓటు వేసినందుకు గర్విస్తున్నా. దేశ పౌరులుగా ఓటు వేయడం మనందరి హక్కు, బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే. ఓటు వేసి మీ స్వరాన్ని వినిపించండి. భారతదేశ భవిష్యత్తును రూపొందించడానికి మీరూ ఓటు వేయండి. జై హింద్’ అని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News January 7, 2025

ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనవరి 8 నుంచి 11 వరకు ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గుతాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

News January 7, 2025

టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠ ద్వార దర్శనాలు: టీటీడీ ఈవో

image

AP: తిరుమలలో 10 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ నెల 10 నుంచి పది రోజుల్లో 7.5 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 3వేల మంది పోలీసులు, 1500 మంది సిబ్బందితో భద్రత కల్పిస్తామని తెలిపారు. టైమ్ స్లాట్ ప్రకారమే వైకుంఠద్వార దర్శనాలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజుల్లో వీఐపీలు స్వయంగా వస్తే దర్శనం కల్పిస్తామని చెప్పారు.

News January 7, 2025

అంద‌రూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా న‌డుస్తోంది: బీజేపీ

image

2014 నుంచి ఇప్ప‌టి దాకా ప‌లు దేశాల అధ్య‌క్షులు, ప్ర‌ధానులు ఓడినవారు కొంద‌రైతే, వివిధ కార‌ణాల‌తో త‌ప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భార‌త ప్ర‌ధానిగా బాధ్య‌తలు చేప‌ట్టాక US మొద‌లుకొని ఆస్ట్రేలియా వ‌ర‌కు ఎంద‌రో దేశాధినేత‌లు ప‌ద‌వుల నుంచి త‌ప్పుకున్నారు. తాజాగా కెన‌డా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అంద‌రూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా న‌డుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.