News March 24, 2026

అమలాపురంలో 27న జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం 8978905032 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News April 8, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం, వెండి ధర వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,370
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,140
* వెండి 10 గ్రాముల ధర రూ.2,480.

News April 8, 2026

సమ్మర్‌లో ఇది నానబెట్టుకుని తింటే..

image

సమ్మర్‌లో గోండ్ కటీరా బాడీని కూల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక నేచురల్ గమ్. Astragalus species అనే మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. రాత్రి ఒక స్పూన్ కటీరాను గ్లాసు నీటిలో నానబెడితే జెల్లీలా తయారవుతుంది. దీన్ని షర్బత్, పాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగాలి. డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిది.

News April 8, 2026

NTR: ACB దాడులలో అరెస్టైన దేవదాయ శాఖ AC నేపథ్యమిదే!

image

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన దేవాదాయ శాఖ ఏసీ శాంతి నేపథ్యం విస్మయానికి గురిచేస్తోంది. 2020లో సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన ఆమె విశాఖ, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లాల్లో పనిచేశారు. అక్రమాల ఆరోపణలతో 2024 జులైలో సస్పెండైన శాంతి, హైకోర్టు ఉత్తర్వులతో ఇటీవలె విధుల్లో చేరారు. ఇంతలోనే ఏసీబీ దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో ఆమెను అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.