News May 7, 2024

HYD నుంచే నక్షత్రాలు, గ్రహాలను చూడొచ్చు..!

image

HYD సెంట్రల్ యూనివర్సిటీలో మినీ అబ్జర్వేటరీ అందుబాటులోకి వచ్చింది. నక్షత్రాలు, గ్రహాలను ఇక్కడి నుంచే టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ ఉస్మానియా ఆధ్వర్యంలో నిజం అబ్జర్వేటరీ, హైదరాబాద్ ఐఐటీలో మరో కేంద్రం అందుబాటులో ఉంది. దీని ద్వారా వాయు కాలుష్య తీవ్రతను సైతం అంచనా వేయొచ్చని, నక్షత్రాలు, గ్రహాల పరిభ్రమణాన్ని అధ్యయనం చేయొచ్చని ప్రొఫెసర్ ఉదయగిరి తెలిపారు.

Similar News

News September 13, 2025

HYD: నిర్లక్ష్య రైడింగ్ ప్రాణాన్ని బలిగొంది..!

image

ఘట్‌కేసర్ పరిధి అన్నోజిగూడలో నిర్లక్ష్య రైడింగ్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. విధులకెళ్తున్న 57 ఏళ్ల ఎలక్ట్రీషియన్ చంద్రారెడ్డిని ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా బైక్‌‌ నడిపి, ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బైక్ నడిపిన 16 ఏళ్ల బాలుడితోపాటు, వాహన యజమాని అయిన అతడి తల్లిపై కేసు నమోదు చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే పేరెంట్స్‌పై కేసులు నమోదు చేస్తామన్నారు.

News September 13, 2025

HYD: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై కవిత ఆగ్రహం

image

పేద విద్యార్థుల చదువులపై ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత HYDలో విమర్శించారు. రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో ఉన్నత విద్యాసంస్థలు బంద్ అయ్యే పరిస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి విద్యాసంస్థలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బకాయిలను చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు.

News September 13, 2025

HYD: మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

image

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్‌ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.