News May 7, 2024

HYD ప్రజలకు మెట్రో GOOD NEWS

image

HYD ప్రజలకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా రామోజీ ఫిలిం సిటీ పాసెస్ అందుబాటులోకి తేనున్నట్లుగా పేర్కొన్నారు. రామోజీ ఫిలిం సిటీలోని సినీ, ప్రకృతి అందాలను వీక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా.. మెట్రో అధికారులు ఎలాంటి ఫెసిలిటీలతో ఫిలిం సిటీ పాస్ అందిస్తారని సర్వత్రా ఆసక్తిగా మారింది.

Similar News

News September 13, 2025

గ్రేటర్ HYDలో సెప్టెంబర్‌లో పెరిగిన విద్యుత్ డిమాండ్

image

గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యుత్ డిమాండ్ గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిందని TGSPDCL అధికారులు గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రోజుకు సుమారు 3,600 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది. అధిక డిమాండ్ కారణంగా సరఫరా స్థిరంగా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 13, 2025

HYD: మరీ ఇంత బరితెగింపా..? రేవంత్ రెడ్డి..!: RSP

image

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ గురుకులంలో విషాహారం తిని 20 మంది అమ్మాయిలు అనారోగ్యానికి గురయ్యారు. ట్రీట్‌మెంట్ చేయించకుండా మీరే నయం చేసుకోండని చేతులు దులుపుకోవడం ఏంటని BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంత బరితెగింపా అని ఫైర్ అయ్యారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జహీరాబాద్‌లో తన ఇంట్లో చికిత్స పొందుతోందని ఆయన Xలో ట్వీట్ చేశారు.

News September 13, 2025

HYD: ఫోన్‌కు APK ఫైల్.. నొక్కితే రూ.95,239 మాయం

image

హైదరాబాద్‌లో టైలర్‌కు RTO CHALLAN పేరిట APK ఫైల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే అకౌంట్ నుంచి రూ.95,239 మాయమయ్యాయి. సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ డేటా దొంగిలించి ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా డబ్బు తిరిగి వచ్చేలా చేశారు. ఇలాంటి APK ఫైల్‌తో మెసేజ్ వస్తే క్లిక్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు.