News May 7, 2024

NLG: ఇక్కడ నేతల తల రాతలు మార్చేది మహిళలే!

image

ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో మహిళల పోలింగ్ శాతం తగ్గితే ఫలితాలపై ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. NLG లోక్ సభ పరిధిలో 17,18,954 ఓట్లకుగానూ 8,76,538 మహిళా ఓటర్లున్నారు. BNG లోక్ సభ పరిధిలో 17,98,704 ఓట్లకు గాను 9,04,250 మంది మహిళా ఓటర్లు ఉండడం విశేషం. ఈ రెండు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థుల తల రాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లకే ఉందన్న
చర్చ జోరుగా సాగుతుంది.

Similar News

News September 12, 2025

అధిక ధరకు యూరియా విక్రయిస్తే చర్యలు: ఎస్పీ

image

యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరకు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియాను సకాలంలో అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీపై సరఫరా అవుతున్న యూరియాను ఎవరైనా అధిక ధరకు విక్రయిస్తే, నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News September 12, 2025

నల్గొండ: 15న ప్రజావాణి రద్దు

image

రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నందున ఈ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు జిల్లా కేంద్రానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు.

News September 12, 2025

NLG: ‘డ్వాక్రా’కు బతుకమ్మ కోక!

image

ఇందిరమ్మ చీరల పేరుతో SHG సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలను ఈ నెల 22 నుంచి ఉచితంగా అందించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసింది. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది పొదుపు సంఘాల మహిళలకు చీరలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నల్లగొండ జిల్లాలో 3,66,532 మంది SHG సభ్యులు ఉన్నారు. వీరికి రెండు చీరలు చొప్పన ఇచ్చేందుకు జిల్లా అధికారులు ఇండెంట్ పంపారు.