News March 25, 2026
సింహాచలం: చందనోత్సవం రోజున కార్యక్రమాలు ఇలా..

సింహాచలం చందనోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరోజున వేకువ జాము ఒంటి గంటకు సుప్రభాత సేవ, 3 గంటలకు ఆలయ వ్యవస్థాప ధర్మకర్త తొలి దర్శనం ప్రారంభమవుతుంది. 3.30 గంటలకు ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు, అనంతరం తితిదే వారి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 4.15 నుంచి 4.30 గంటల లోపు మొదటి స్లాట్ వీఐపీ దర్శనాలు మొదలవుతాయి. 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి.
Similar News
News April 6, 2026
పుష్కరాలు ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలి: ప్రిన్సిపల్ సెక్రటరీ

సరస్వతి పుష్కరాలలో వచ్చిన సమస్యలు పునరావృతం కాకుండా సమగ్రమైన ప్రణాళికలు తయారు చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు. పారిశుద్ధ్యం పకడ్బందీగా ఉండాలని ఎలాంటి సమస్య రాకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. 540 మరుగు దొడ్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లోకేషన్లు, కెపాసిటీ ప్రణాళికలు తయారు చేయాలని తెలిపారు. బస్టాండ్‌లో సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
News April 6, 2026
జిల్లాలో కురవనున్న భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

ఏలూరు జిల్లాలో రాబోయే 3 గంటలలో 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయన్న విశాఖపట్టణం తుఫాన్ హెచ్చరికల కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కె. వెట్రి సెల్వి విజ్ఞప్తి చేశారు. ప్రజలు బహిరంగ ప్రదేశాలకు రావద్దని, చెట్లు కింద, శిథిల భవనాల వద్ద నిలబడవద్దని సూచించారు. ఉరుములు, మెరుపుల సమయంలో రైతులు పొలాలకు దూరంగా ఉండాలన్నారు.
News April 6, 2026
HYD: పసిపాపకు పాలివ్వలేక.. ‘గుండె’ పగిలింది

పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసిపాప(26రోజుల)కు పాలివ్వలేని దీన స్థితిలో ఆ తల్లిని విధి దూరం చేసింది. ఆదివారం ఉప్పల్‌లో IPL మ్యాచ్ అయ్యాక ఏర్పడిన భీకర ట్రాఫిక్‌లో హార్ట్‌ఎటాక్‌తో బాలింత తల్లడిల్లింది. గంటకుపైగా ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది. చివరకు ఆక్సిజన్ అయిపోవడంతో ఘట్‌కేసర్‌కు చెందిన బిష్ణ(30) కన్నుమూసింది. క్షణాలు లెక్కపెడుతూ, పసికూన భవిష్యత్‌ను ఊహించలేక ఆ కుటుంబం పడిన బాధ వర్ణనాతీతం.


