News March 25, 2026
అమ్రాబాద్: లాంటానాతో ‘బ్లాక్ గోల్డ్’ ఉత్పత్తి!

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో ఆక్రమణ మొక్క లాంటానాను ‘బయోచార్’గా మార్చే వినూత్న పైలట్ ప్రాజెక్టును చేపట్టారు. దీనివల్ల అడవి రక్షణతో పాటు టన్నుకు రూ.7,000 ఆదాయం లభిస్తుందని ఐఎఫ్ఎస్ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు. ఈ చర్యతో వన్యప్రాణుల ఆవాసాలు మెరుగుపడటమే కాకుండా స్థానిక గిరిజనులకు ఉపాధి కలుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.
Similar News
News April 17, 2026
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి: IGP

భద్రాద్రి జిల్లాలో చోటుచేసుకున్న రహదారి ప్రమాదాలు, వాటి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై IGP చంద్రశేఖర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దమ్మపేట ప్రజలకు అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, రహదారి ప్రమాదాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు సైబర్ మోసాలపై, బయటకు వెళ్లినప్పుడు రహదారి ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. డబ్బు పోతే వస్తుంది కానీ ప్రాణాలు కాదని చెప్పారు.
News April 17, 2026
దిగుమతుల్లో గోల్డ్, సిల్వర్ సరికొత్త రికార్డ్

2025-26లో దేశంలో బంగారం, వెండి దిగుమతుల విలువ జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే బంగారం దిగుమతి విలువ $71.98 బిలియన్లకు పెరిగింది. అయితే పరిమాణం పరంగా 4.76% తగ్గి 721.03 టన్నులకు క్షీణించింది. వెండి దిగుమతి విలువ 150% పెరిగి $12Bకు (7,344.96 టన్నులు) చేరింది. మరోవైపు 15 బ్యాంకులకు గోల్డ్, సిల్వర్ దిగుమతులపై అనుమతిని 2029 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
ఈ కారణాలవల్లే రోడ్డు ప్రమాదాలు: భద్రాద్రి ఎస్పీ

రహదారి ప్రమాదాల నివారణలో పోలీస్, మున్సిపల్, వైద్య, రవాణా శాఖల సమన్వయం కీలకమని భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని దమ్మపేట సభలో తెలిపారు.


