News March 25, 2026
విశాఖ: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నిందితుడి అరెస్ట్

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.60 లక్షలు వసూలు చేసిన విశాఖకు చెందిన శ్యామ్ కుమార్‌ను విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 2025లో పలువురి వద్ద నగదు తీసుకుని పరారైన నిందితుడిని,సాంకేతిక పరిజ్ఞానంతో మంగళవారం పట్టుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులు ఇటువంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
Similar News
News April 18, 2026
రోజుకు 8 గంటలు కష్టపడుతున్న రష్మిక

రవీంద్ర పుల్లే డైరెక్షన్‌లో రష్మిక లీడ్ రోల్ చేస్తున్న ‘మైసా’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న ఆమె యాక్షన్ సీక్వెన్స్ కోసం బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. రోజుకు 8 గంటలపాటు స్టంట్ కోఆర్డినేషన్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ట్రైనింగ్(ఆర్మీ తరహా శిక్షణ) తీసుకుంటున్నారు. త్వరలో కేరళంలో 16 రోజుల పాటు యాక్షన్ షెడ్యూల్‌కు మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
News April 18, 2026
‘ఖాకీ హీరోల’ను అభినందించిన కామారెడ్డి ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో సాహసోపేతంగా ప్రాణాలు కాపాడిన పోలీసులను SP రాజేశ్ చంద్ర శనివారం అభినందించారు. ఉరేసుకున్న వ్యక్తిని రక్షించడం, వాటర్ ట్యాంక్ ఆత్మహత్యాయత్నం భగ్నం చేయడం, దొంగలను పట్టుకోవడం వంటి ఘటనల్లో సిబ్బంది చూపిన సమయస్ఫూర్తిని కొనియాడారు. విధి నిర్వహణలో మానవత్వం చాటిన ఐదుగురు కానిస్టేబుళ్లు, హోంగార్డులకు నగదు పురస్కారాలు అందజేశారు. ప్రాణ రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యమని SP పేర్కొన్నారు.
News April 18, 2026
మరో ఆపరేషన్ సిందూర్‌కు గెట్ రెడీ: సీడీఎస్

ఆపరేషన్ సిందూర్ నెక్స్ట్ ఫేజ్‌కు భారత దళాలు సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఆపరేషన్స్‌లో పైచేయి సాధించేందుకు ఆర్మీ సమాచార సేకరణపై దృష్టిపెట్టిందన్నారు. OPSకు త్వరలో ఏడాది (మే 7) పూర్తికానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.


