News March 25, 2026
క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలు శిక్ష!

కొరత భయంతో చాలా మంది ఇళ్లలో ఇంధనాన్ని నిల్వ చేసుకుంటున్నారు. అయితే పెట్రోలియం చట్టం-1934 ప్రకారం క్యాన్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ఇంధనం నిల్వ చేయడం నేరం. తొలిసారి చిక్కితే ₹వెయ్యి ఫైన్/ నెల జైలు శిక్ష.. రెండోసారి ₹5వేలు ఫైన్, 3 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. బంక్ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తారు. ఒకవేళ నిల్వ వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తే క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటారు. SHARE IT
Similar News
News April 7, 2026
ఇండక్షన్ స్టవ్‌లపై కేంద్రం కీలక నిర్ణయం

ఇండక్షన్ స్టవ్‌లకు జులై 1 నుంచి అమలు కావాల్సిన స్టార్ రేటింగ్ నిబంధనను కేంద్ర ప్రభుత్వం 6 నెలల పాటు వాయిదా వేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న వంటగ్యాస్ కొరత దృష్ట్యా ప్రజలు ఇండక్షన్ స్టవ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త నిబంధనల వల్ల మార్కెట్లోకి స్టవ్‌లు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నిబంధనలు ఇప్పుడు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
News April 7, 2026
19 ఏళ్లకే తొలి లవ్ బ్రేకప్: అడివి శేష్

తనకు లవ్ బ్రేకప్ కథలంటే ఇష్టమని అడివి శేష్ తెలిపారు. ‘డెకాయిట్’ ప్రమోషన్లలో మాట్లాడుతూ ‘19 ఏళ్లకే తొలిసారి ప్రేమలో విఫలమయ్యా. దాని నుంచి కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. ఆ ఫీలింగ్‌ను ఈ మూవీలో హరి పాత్ర ద్వారా చూపే ప్రయత్నం చేశా. నా ప్రతి కథలోనూ బ్రేకప్ ప్రభావం కొంతైనా ఉంటుంది. నేను సిగరెట్స్, మందు, నాన్ వెజ్ తీసుకోను. అందుకే ఇప్పటికీ ఒకేలా ఉన్నా’ అని చెప్పారు. కాగా ఈ చిత్రం APR 10న విడుదల కానుంది.
News April 7, 2026
US దళాలు యురేనియం దొంగిలించడానికే వచ్చాయి: ఇరాన్

F-15E పైలట్‌ను రక్షించే సాకుతో అమెరికా తమ దేశంలోని యురేనియం నిల్వలను దొంగిలించడానికి యత్నించిందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది. రెస్క్యూ పేరుతో వచ్చిన US దళాలు అణు నిల్వలున్న ప్రాంతంపై కన్నేశాయని పేర్కొంది. అయితే ఈ ఆపరేషన్‌ను తాము సమర్థంగా తిప్పికొట్టామని, అమెరికా విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రతినిధి వెల్లడించారు. మరోవైపు తమ సైనికుడిని సేఫ్‌గా తీసుకొచ్చామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.


