News March 25, 2026
అనకాపల్లి జిల్లాలో కొత్తగా 3 నియోజకవర్గాలు..!

అనకాపల్లి జిల్లాలో కొత్తగా 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా పరవాడ, గొలుగొండ, కె.కోటపాడు నియోజకవర్గ కేంద్రాలుగా ఏర్పడవచ్చునని భావిస్తున్నారు. పరవాడ, మునగపాక అచ్యుతాపురం మండలాలు, గొలుగొండ, నాతవరం, రోలుగుంట మండలాలు, కె.కోటపాడు, సబ్బవరం, దేవరాపల్లి మండలాలతో 3 కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది.
Similar News
News April 4, 2026
NZB: గిరిజన యువతకు కేరళంలో నైపుణ్య శిక్షణ

నిజామాబాద్ జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు భారత్ పెట్రోలియం (BPCL) ఆధ్వర్యంలో కేరళంలోని కోచి స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇచ్చేందుకు 25 సీట్లు కేటాయించారు. మే 2026లో ప్రారంభమయ్యే ఈ కోర్సులకు అర్హులైన వారు ఏప్రిల్ 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆసక్తి గల యువత పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని వివరించారు.
News April 4, 2026
‘వేదమందిర్’కు పూజారులు కావలెను

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు పూజారులను నియమించుకుంటోంది. లక్షలాది తెలుగు భక్తులకు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిపుణులైన పూజారులు కావలెను.అర్హతలు: వేద విజ్ఞానం, నిత్య పూజా విధానాలపై మంచి పట్టు, భక్తులకు పూజా విశిష్టతను, విధివిధానాలను స్పష్టంగా వివరించే నైపుణ్యంఅనుభవం: ఆలయాలు/వ్యక్తిగత పూజా కార్యక్రమాల్లో చేసి ఉండాలి
వివరాలకు <<7995978484>>7995978484<<>>
News April 4, 2026
పాక్‌పై భారత్ మరోసారి దాడి చేస్తుందా?

పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. దీన్నే అవకాశంగా మలుచుకొని దాయాదిని దెబ్బకొట్టాలని IND భావిస్తోందా? ఉగ్రవాదాన్ని పోషిస్తూ కంట్లో నలుసులా మారిన PAKను OpS-2తో నాశనం చేయడానికి సిద్ధమవుతోందా? త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ భేటీలు, పాక్‌కు <<19547918>>వార్నింగ్<<>>, రాష్ట్రాల్లో మాక్ డ్రిల్, ప్రజలకు 3 నెలల రేషన్(యుద్ధం వస్తే ఇబ్బంది పడకుండా) సరఫరా ఈ ప్రశ్నలకు బలం చేకూరుస్తున్నాయి.


