News March 25, 2026
లక్ష్యాలను పూర్తి చేయండి.. బ్యాంకర్లకు కలెక్టర్ ఆదేశం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో, ప్రభుత్వ ప్రాధాన్య పథకాల గ్రౌండింగ్ లక్ష్యాలను తక్షణమే పూర్తి చేయాలని నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమలు, విద్య, గృహ నిర్మాణ రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
Similar News
News April 20, 2026
NLG: పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్‌కు ఫిర్యాదు

వంగమర్తి గ్రామ కార్యదర్శి దేవేందర్ తనను వేధిస్తున్నాడని బాధితుడు భూత్కూరు వెంకటరెడ్డి సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సంబంధించిన యాజమాన్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, కార్యదర్శి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తున్న కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు.

NLG: రైతులకు గుడ్ న్యూస్.. నేడు రెండో విడత భరోసా…

జిల్లాలో రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు రెండో విడత ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా జిల్లాలోని 5,22,313 మంది రైతులకు రూ. 268.57 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఎకరాల వారీగా రైతులకు సాయం అందించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇవాళ రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేయనున్నది.