News March 25, 2026
నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు చేరుకోవాలి: జేసీ

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమని, రుణాలు అందజేయడంలో నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని JC పర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘DCC’, ‘DLRC’ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. జిల్లా సమగ్ర ప్రగతి సాధించాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో గణనీయమైన వృద్ధి అవసరమని, ఈ రంగాల్లోని లబ్ధిదారులకు బ్యాంకులు ఉదారంగా రుణసాయం అందించాలని సూచించారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్లైన్లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.