News March 25, 2026
HYD: CAB బుక్ చేసిన యువతి.. డ్రైవర్ BAD మెసేజ్!

క్యాబ్ బుక్ చేసుకొన్న కొండాపూర్‌కు చెందిన యువతికి డ్రైవర్ నుంచి అసభ్యకర సందేశం రావడంతో ఖంగుతిన్నట్లు తెలిపారు. ‘క్యాబ్ ఎక్కకుండా రోడ్డుపైనే ఉండిపోయాను. డ్రైవర్ తీరు పట్ల సదరు సంస్థకు ఫిర్యాదు చేశాను. అతడిపై పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి’ అని SMలో పోస్ట్ చేశారు. స్పందించిన పోలీసులు తదుపరి చర్యలకై ఆమెకు సూచనలు చేశారు. ఎవరైనా ఇలా వేధిస్తే వెంటనే 87126 56856(WhatsApp), డయల్ 100కు సమాచారం ఇవ్వండి.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్డ్ వైద్యం అందించనున్నారు.