News March 25, 2026
NZB: పోలీస్ కమీషనర్ యాక్షన్ ప్లాన్.. తగ్గిన NBWలు

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లలో చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల (NBWs) సంఖ్యను తగ్గించడానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య యాక్షన్ ప్లాన్ చేపట్టారు. దీనితో ఈ నెల 20 నుంచి 24 వరకు 105 NBWలను పరిష్కరించారు. వేరే రాష్ట్రాలలో పరారీలో ఉన్న 9 మంది నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.