News March 26, 2026
భద్రాచలానికి మహర్దశ!

TG: యాదగిరిగుట్ట, వేములవాడ తరహాలోనే భద్రాచలం రాములవారి ఆలయం త్వరలో అభివృద్ధికి నోచుకోనుంది. ప్రభుత్వం తొలి విడత కింద రూ.351 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 3 దశల్లో రూ.586 కోట్లతో ఆలయాన్ని డెవలప్‌మెంట్ చేయడానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ విస్తరణ, ఇతర సౌకర్యాలతో పాటు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. కాగా ఎల్లుండి భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధమైంది.
Similar News
News April 7, 2026
శబ్దమే లేని మాయా గది.. ఎక్కడుందంటే?

వాషింగ్టన్‌లోని మైక్రోసాఫ్ట్ కేంద్రంలో వింతైన ‘అనెకోయిక్ ఛాంబర్’ ఉంది. ఇక్కడ నిశ్శబ్దం ఏ స్థాయిలో ఉంటుందంటే.. గాలిలోని అణువుల కదలిక కూడా వినిపిస్తుంది. -20.35dB శబ్దంతో గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ గదిలో మన గుండె చప్పుడు, ఎముకల రాపిడి కూడా స్పష్టంగా వినిపిస్తాయి. ఈ రూమ్‌లో 45 నిమిషాలకు మించి ఉంటే తల తిరిగి పడిపోతారట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(40/100)
News April 7, 2026
రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు: APSDMA

AP: TG, రాయలసీమ, TN ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉందని APSDMA తెలిపింది. దీంతో రేపు SKLM, VZM, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
News April 7, 2026
బ్యారెల్ $150 దాటితే భారత్‌కు దెబ్బే: మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్

క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $150 దాటి ఓ త్రైమాసికం పాటు కొనసాగితే అది భారత్ GDP గ్రోత్‌పై ప్రభావం చూపిస్తుందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ వెల్లడించింది. FY27లో గ్రోత్ రేట్ 5.7%కు పరిమితమవుతుందని.. కొవిడ్ తర్వాత నమోదైన అత్యల్ప గ్రోత్ ఇదే అవుతుందని తెలిపింది. అలాగే GDP అంచనాను 6.5% నుంచి 6.2%కు తగ్గించింది. కాగా ప్రస్తుతం బ్రెంట్ బ్యారెల్ $110, WTI క్రూడ్ $114 వద్ద ట్రేడవుతున్నాయి.


