News March 26, 2026
రేపు సెలవు

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. ప్రభుత్వాలు రిలీజ్ చేసిన క్యాలెండర్ ప్రకారం శుక్రవారాన్ని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. అటు బ్యాంకులకు సైతం సెలవు ఉంది. 28న నాలుగో శనివారం, 29న ఆదివారం కాబట్టి వరుసగా 3 రోజులు బ్యాంకులు పని చేయవు. దీంతో ఈ రోజే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్.
Similar News
News April 15, 2026
AP, TGలో ఎన్ని లోక్‌సభ స్థానాలు పెరుగుతాయ్?

లోక్‌సభ స్థానాల పునర్విభజనతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ముఖచిత్రం మారనుంది. మొత్తం సీట్లు 850కి (54.54%) పెరిగితే.. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా ఏపీలో 14, తెలంగాణలో 9 సీట్లు కలవనున్నాయి. అంటే ఏపీలో మొత్తం ఎంపీ సీట్లు 39కి, తెలంగాణలో 26కి చేరతాయి. ఒకవేళ పెంపు 50%కే పరిమితమైతే APలో 13 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాదిలో 50% అయితే 65 సీట్లు, 54.54% అయితే 71 స్థానాలు పెరుగుతాయి.
News April 15, 2026
గూగుల్ డేటా సెంటర్‌కు ‘డీమ్డ్ డిస్కం’ హోదా.. అసలేంటిది?

APలో 300 మెగావాట్ల కెపాసిటీకి మించి ఏర్పాటయ్యే డేటా సెంటర్లకు ‘డీమ్డ్ డిస్కం’ హోదా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఈ అవకాశం కల్పించింది. త్వరలోనే ఉత్తర్వులివ్వనుంది. రాష్ట్రంలో ఈ హోదా పొందనున్న తొలి ప్రైవేట్ సంస్థ ఇదే. ఇకపై ఆ కంపెనీ ఎలక్ట్రిసిటీ కొరత లేకుండా ఎక్కడినుంచైనా నేరుగా విద్యుత్ కొనుగోలు చేయవచ్చు. సొంతంగా ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటుచేసుకోవచ్చు.
News April 15, 2026
CBSE టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు?.. విద్యార్థుల ఎదురుచూపులు

సీబీఎస్‌ఈ టెన్త్ రిజల్ట్స్ కోసం స్టూడెంట్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిన్నే విడుదల అవుతాయని జాతీయ మీడియాలో ప్రచారం జరగడంతో అధికారిక వెబ్‌సైట్‌ను పదేపదే చెక్ చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. రిజల్ట్స్‌పై కచ్చితమైన డేట్ అండ్ టైమ్ ప్రకటించాలని విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.


