News March 26, 2026

అమరావతిలో అగ్ని ప్రమాదాలు.. సిట్ ఏర్పాటు

image

AP: అమరావతిలో వరుసగా జరుగుతున్న <<19471226>>అగ్నిప్రమాదాలపై<<>> ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరగనుంది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశించింది. సిట్ బృందంలో DSP, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు ఉన్నారు. ఇటీవల L&T, మేఘా ఇంజినీరింగ్ కంపెనీల పైపులు దగ్ధమయ్యాయి. వీటి వెనుక కుట్ర ఉండొచ్చని సీఎం అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News April 17, 2026

అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

image

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.

News April 17, 2026

కాసేపట్లో ఓటింగ్.. బలాబలాలు ఇవే

image

మహిళా రిజర్వేషన్లు(రాజ్యాంగ సవరణ), డీలిమిటేషన్ బిల్లులపై కాసేపట్లో లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుతం LSలో 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే 360 మంది MPల మద్దతు కావాలి. NDAకి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లులు పాస్ కావాలంటే మరో 67 మంది MPల సపోర్ట్ అవసరం. అటు విపక్షాల బలం 233. ఎక్కువ మంది విపక్ష పార్టీల సభ్యులు గైర్హాజరైతే బిల్లులు పాసయ్యే ఛాన్స్ ఉంది.

News April 17, 2026

16ఏళ్ల నుంచే రిలేషన్‌షిప్‌లో ఉన్నా: నటి

image

తాను 16ఏళ్ల వయసు నుంచే రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని ఆలియా భట్ సోదరి, నటి పూజాభట్ వెల్లడించారు. ఇప్పుడు సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని.. విడాకుల తర్వాత స్వేచ్ఛగా బతుకుతున్నానని తెలిపారు. 2003లో మనీశ్ మఖీజాను పెళ్లిచేసుకున్న పూజా భట్ 2014లో డైవర్స్ తీసుకున్నారు. 50+ ఏజ్‌లో జిమ్‌‌కు వెళ్లడం అలవాటైందని, ఇప్పుడు అది తనకు టెంపుల్‌లాంటిదని అన్నారు. హన్సిక కూడా ఇలాగే <<19671407>>సింగిల్<<>> లైఫ్‌పై కామెంట్స్ చేశారు.