News March 27, 2026
భద్రాద్రి బార్ కౌన్సిల్ విజేతలు వీరే..!

భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ముదల్కర్, ఉపాధ్యక్షురాలిగా షాజహాన్ పర్వీన్, ఉపాధ్యక్షుడిగా కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా గడదాసు నాగరాజు, గ్రంథాలయ కార్యదర్శిగా దొడ్డ ప్రసాద్, కోశాధికారిగా సంధ్యారాణి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శులుగా దేవదాస్, ఉమ గెలుపొందారు. 328 ఓట్లకు గాను 309 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News April 18, 2026
సూర్యాపేట డీఐఈఓగా సులోచన రాణి బాధ్యతలు

సూర్యాపేట డీఐఈఓగా బి. సులోచన రాణి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న భాను నాయక్ ఆమెకు బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సులోచన రాణి మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా ప్రమాణాల పెంపునకు, కళాశాలల పర్యవేక్షణకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 18, 2026
జగిత్యాల: ‘కాంగ్రెస్ విజయాల్లో సేవాదళ్ కీలకం’

జగిత్యాలలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ కన్నా ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గాజంగి నందయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తుందని, క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు.
News April 18, 2026
GNT: వైసీపీలో ‘ఆధిపత్య’ రగడ.. అంబటి VS అప్పిరెడ్డి!

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా అంబటి బాధ్యతలు చేపట్టగా, స్థానికంగా అప్పిరెడ్డికి ఉన్న బలమైన అనుచరగణం ఇద్దరి మధ్య చిచ్చుకు కారణమవుతోంది. నియోజకవర్గ రహస్యాలు ప్రత్యర్థి వర్గానికి చేరుతున్నాయనే అనుమానంతో నేతల మధ్య గ్యాప్ పెరగడం, క్యాడర్‌లో గందరగోళానికి దారితీస్తోంది.


