News March 27, 2026
వరంగల్‌లో హోటళ్ల మూత..!

అంతర్జాతీయ పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హోటల్ రంగం కుదేలవుతోంది. యుద్ధ ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరగడం, పర్యాటక ఆధారిత హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే బ్రేక్‌ఫాస్ట్ ధరలను పెంచిన యాజమాన్యాలు, స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ సేవలను నిలిపివేశాయి. ట్రై సిటీ పరిధిలోని దాదాపు 1,100 హోటళ్లు మరో వారం రోజుల్లో పూర్తిగా మూతపడే ప్రమాదం కనిపిస్తోంది.
Similar News
News April 17, 2026
HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 17, 2026
TU: పార్లమెంట్‌లో ప్రసంగించిన ‘కీర్తన’ను అభినందించిన ఉపకులపతి

అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం నుంచి ఎంపికైన TU విద్యార్థిని కీర్తన ఈనెల 14న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రసంగించారు. VC యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి ఆమెను అభినందించారు. యూనివర్సిటీ తరఫున రూ.5 వేల ప్రోత్సాహక బహుమతి అందజేశారు. VC మాట్లాడుతూ.. కీర్తన ఇంకెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టలను పెంపొందించాలని ఆకాంక్షించారు.
News April 17, 2026
హీరోయిన్ పెళ్లి వార్తలు.. ఖండించిన తల్లి

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలను ఆమె తల్లి లిస్సీ ఖండించారు. వారి మ్యారేజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఓ వ్యక్తి SMలో చేసిన కామెంట్‌కు ఆమె ‘ఫాల్స్ న్యూస్’ అని ఆన్సరిచ్చారు. 2022లో వచ్చిన హృదయం మూవీలో వీరిద్దరూ మ్యారీడ్ కపుల్‌గా నటించారు. ఆ సమయంలో ప్రేమ చిగురించిందని రూమర్లు వచ్చాయి. కాగా గతేడాది లోక: చాప్టర్-1తో కళ్యాణి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.


