News March 27, 2026

HYD: త్వరలో తీన్మార్ మల్లన్న పాదయాత్ర

image

అసెంబ్లీ చీట్ చాట్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలతో కలిసేది లేదని, బీసీల హక్కుల కోసం బరిలోకి దిగుతామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2 నుంచి పాదయాత్ర చేపడతామని, హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో కొనసాగి… చివరలో వరంగల్‌లో భారీ బహిరంగ సభతో ముగుస్తుందన్నారు.

Similar News

News April 1, 2026

‘ఏఐ సెక్సువల్’.. ఇప్పుడు కొత్త ట్రెండ్!

image

ఆహారపు అలవాట్లు, ఇష్టాలే కాదు బంధాల్లోనూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే ‘ఏఐ సెక్సువల్’. లైంగిక విషయాల గురించి ఏఐతో పంచుకునే వాళ్లు వాళ్లను ‘ఏఐ సెక్సువల్’గా పేర్కొంటున్నారు. JoiAI అనే ప్లాట్‌ఫామ్ సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్‌పై, 33% సెక్స్ చాట్‌కు AIని వినియోగిస్తున్నట్లు తేలింది. గోప్యత, ఫ్రీగా మాట్లాడొచ్చనే ఏఐపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

News April 1, 2026

మేడ్చల్: నేటి నుంచే 3నెలల రేషన్ బియ్యం

image

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డుదారులకు మూడు నెలల సన్న బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా మేనేజర్ ఎల్.సుగుణ బాయి తెలిపారు. జిల్లాలోని 6,45,442 కార్డుల కింద ఉన్న 22,17,063 లబ్ధిదారులకు, ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. జిల్లాలోని 6 MLS పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరిగిందని, నేటి నుంచి పంపిణీ చేస్తామన్నారు. SHARE IT.

News April 1, 2026

JGTL: రాజకీయాల్లో కీలక మలుపు.. తెరపైకి చరిష్మా రెడ్డి?

image

JGTL జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్‌తో 4 దశాబ్దాల అనుబంధాన్ని వీడి మాజీ మంత్రి జీవన్‌రెడ్డి త్వరలో BRSలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్న ఆయన.. రానున్న ఎన్నికల్లో తన కోడలు చరిష్మా రెడ్డిని రాజకీయ రంగ ప్రవేశం చేయించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు కమిట్మెంట్‌లు తీసుకున్న ఆయన, కారు ఎక్కేందుకు సమాయత్తమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.