News May 8, 2024
జాతీయ పురస్కారాలకు దరఖాస్తులు

NLR: జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ తెలిపారు. క్రీడలు, సామాజిక సేవారంగం, ధైర్య సాహసాలు, నూతన ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక సంప్రదాయాలు, శాస్త్ర సాంకేతికత, విజ్ఞాన రంగాల్లో ప్రతిభ చూపిన బాలబాలికలు ఈ నెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News October 23, 2025
VIDEO.. సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షపు నీరు డ్యామ్ నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో దిగువ పెన్నా డెల్టాకు 32,650 నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 70 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు.
News October 23, 2025
ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
News October 23, 2025
ఛామదల నేరెళ్ల వాగులో పడి వ్యక్తి గల్లంతు..!

జలదంకి మండలం ఛామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున (45) చామదల గ్రామం నుంచి కావలికి వెళ్లేందుకు తన బైక్‌పై నేరెళ్ల వాగు దాటేందుకు ప్రయత్నించగా బైక్ అదుపు తప్పింది. దీంతో బైక్ తోపాటు మల్లికార్జున కూడ సప్తా పై నుంచి వాగులో పడిపోయారు. విషయం తెలుసుకున్న జలదంకి తహశీల్దార్ ప్రమీల, ఎస్సై సయ్యద్ లతీ ఫున్నిసా అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులతో మాట్లాడి గాలింపు చర్యలు చేపట్టారు.