News March 28, 2026

RCB Vs SRH.. పైచేయి ఎవరిదంటే?

image

IPLలో RCB, SRH మధ్య ఇప్పటిదాకా 26 మ్యాచ్‌లు జరిగాయి. 11 సార్లు RCB, 14 సార్లు SRH గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 2024 ఎడిషన్‌లో SRH అత్యధిక స్కోరు(287/3) నమోదు చేయగా, 2022లో RCB అత్యల్ప పరుగులు(68/10) చేసింది. బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ SRHపై 805 రన్స్ చేశారు. ఆ జట్టుపై ఎక్కువ మ్యాచ్‌లు(24) ఆడింది కూడా కోహ్లీనే. రేపు రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది.

Similar News

News April 15, 2026

‘AMARAVATHI’ కాదు ‘AMARAVATI’

image

AP: రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో తప్పుడు స్పెల్లింగ్‌ వినియోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎలా వాడాలో సూచిస్తూ CS సర్క్యులర్ జారీచేశారు. 2015లో ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ‘AMARAVATI’ని ప్రకటించిందని పేర్కొన్నారు. అయితే కలెక్టర్లు, ఇతర అధికారులు నివేదికల్లో అమరావతిని ఇంగ్లిష్‌లో ‘AMARAVATHI’ అని రాస్తున్నారని పేర్కొంది. ఇకపై ‘AMARAVATI’ అని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

News April 15, 2026

అమ్మాయిలకు మీసాలు.. కారణమిదే

image

కొంతమంది అమ్మాయిలకు అబ్బాయిల్లా మీసాలు, గడ్డాలు రావడంతో పాటు ముఖంపై ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయి. ఈ సమస్యను హిర్సుటిజం(Hirsutism) అంటారు. ఈ సమస్య PCOD, థైరాయిడ్ ఉన్నవారిలో కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో చాలా తక్కువ మోతాదులో ఉండే మేల్ హార్మోన్స్ పెరగడం, కొన్నిరకాల మందులు వాడటం వల్ల కూడా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. సమస్యను గుర్తించగానే వైద్యులను సంప్రదించడం మంచిది.