News May 8, 2024

సిక్ లీవ్‌లో ఎయిర్ ఇండియా సిబ్బంది.. 70 విమానాలు రద్దు!

image

ఎయిర్ ఇండియాకు చెందిన 70కి పైగా విమానాలు రద్దయ్యాయి. ఒక విభాగంలోని సిబ్బంది అంతా ఉన్నట్టుండి సిక్ లీవ్ పెట్టారని, దీంతో నిన్న రాత్రి నుంచి నేటి ఉదయం వరకు పలు విమానాలు రద్దయినట్లు సంస్థ తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంటూ ప్రయాణికులను క్షమాపణలు కోరింది. ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకి వచ్చే ముందు తమ ఫ్లైట్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News January 28, 2026

వికారాబాద్: తొలిరోజు.. ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..?

image

వికారాబాద్ జిల్లాలో తొలిరోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలైన పరిగిలో 2, తాండూర్‌ 11, వికారాబాద్‌లో 12 నామినేషన్లను అభ్యర్థులు వేశారు. కాగా CM ఇలాకా అయిన కొడంగల్‌లో ఒక్క నామినేషన్ కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే తొలిరోజు మందకొడిగా ఈ ప్రక్రియ సాగినా రేపట్నుంచి వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.

News January 28, 2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సీఎం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో ప్రచారం చేయనున్నారు. కాగా ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

News January 28, 2026

ప్రమాదాల నుంచి వీళ్లు బయటపడ్డారు!

image

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ <<18980548>>చనిపోవడం<<>> తెలిసిందే. గతంలో పలువురు నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. MH CM ఫడణవీస్ ఏకంగా 6సార్లు బయటపడ్డారు. 1977లో PM మొరార్జీ దేశాయ్, 2001లో అశోక్ గెహ్లోత్, 2004లో కాంగ్రెస్ నేతలు అహ్మద్ పటేల్, పృథ్వీరాజ్ చవాన్, కుమారి షెల్జా, 2007లో అమరీందర్ సింగ్, 2009లో సుఖ్‌బీర్ సింగ్, 2010లో రాజ్‌నాథ్ సింగ్, 2012లో అర్జున్ ముండా తప్పించుకున్నారు.