News March 28, 2026
HYD: సీతారాముల పెళ్లికి పులకించిన పుడమి!

రామరాజ్యం అంటేనే సుభిక్షం. ధర్మబద్ధమైన పాలనలో నెలకు 3 వానలతో సస్యశ్యామలమని ప్రతీతి. అదే రీతిలో శ్రీ సీతారాముల కళ్యాణం రోజు పుడమి తల్లి పులకించేలా వర్షం కురిసింది. ముక్కోటి దేవతలు అక్షింతలు జల్లినట్లు వర్షం రూపంలో కరుణించారేమో అని భక్తులు విశ్వసిస్తున్నారు. కురిసిన ప్రతి జలధారను దేవతల కరుణామృతంగా భావించిన భక్తజనం భక్తి పరవశంతో ఆస్వాదించారు. అంతా రామమయం.. జగమంతా రామమయం అని వ్యాఖ్యానిస్తున్నారు.
Similar News
News April 6, 2026
రాజమండ్రి: ఏప్రిల్ 7న జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఏప్రిల్ 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ సోమవారం తెలిపారు. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన 19-35 ఏళ్ల అభ్యర్థులు అర్హులు. అర్హత గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News April 6, 2026
TU: డిగ్రీ పరీక్ష ఫీజుల చెల్లింపు గడువు మళ్లీ పొడిగింపు

టీయూ పరిధిలో డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యార్థుల రెగ్యులర్ 2, 4, 6, బ్యాక్ లాగ్ 1, 3, 5 (2021 నుంచి 2025 వరకు) సెమిస్టర్ల పరీక్ష ఫీజుల గడువును మళ్లీ పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇది వరకే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించామని పేర్కొన్నారు. ఈ నెల 8లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
News April 6, 2026
CTR: జనసేనలో చేరిన నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షుడు

వి.కోట మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ, నందమూరి అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ నాయుడు అలియాస్ బుల్లెట్ నాయుడు జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ నాగబాబు ఆధ్వర్యంలో ఇటీవల ఆ పార్టీ జెండా కప్పుకొన్నారు. యువ రాజకీయాలకు జనసేనాని సిద్ధాంతాలు ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు. భావితర రాజకీయానికి యువతను ప్రోత్సహించడంతో ఆ పార్టీలో చేరానని చెప్పారు.


