News May 8, 2024

BUZZ: ప్రభాస్ కోసం మహేశ్ వాయిస్ ఓవర్!

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ‘కల్కి’ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే, సినిమాపై మరింత ఆత్రుత పెంచేందుకు మేకర్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబును రంగంలోకి దింపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. విష్ణు అవతారంలో ఉన్న ప్రభాస్‌ను పరిచయం చేసే సన్నివేశానికి మహేశ్‌తో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే నాగ్ అశ్విన్ టీమ్ బాబుని సంప్రదించినట్లు టాక్.

Similar News

News January 25, 2026

టాస్ గెలిచిన టీమ్ ఇండియా.. టీమ్స్ ఇవే

image

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్‌కు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో బుమ్రా, బిష్ణోయ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, బుమ్రా, కుల్దీప్, బిష్ణోయ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, జెమీసన్, హెన్రీ, సోథీ, జాకబ్.

News January 25, 2026

రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ అవార్డ్స్

image

ఈ ఏడాది క్రీడల రంగంలో 8 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. క్రికెట్‌లో రోహిత్ శర్మతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్‌కు లభించాయి. అలాగే మహిళల హాకీ గోల్‌కీపర్ సవితా పునియా, అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌, పంజాబ్‌కు చెందిన బల్దేవ్ సింగ్, MP నుంచి భగవాన్‌దాస్ రైక్వార్, పుదుచ్చేరి కె.పజనివేల్‌ను అవార్డులు వరించాయి. జార్జియాకు చెందిన వ్లాదిమిర్ మెస్త్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ ప్రకటించారు.

News January 25, 2026

ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (1/2)

image

పాడ్యమి: ఆరోగ్యం, తేజస్సు కోసం అగ్ని దేవుడు.
విదియ: విద్య, జ్ఞానం కోసం బ్రహ్మ దేవుడు.
తదియ: సౌభాగ్యం కోసం, గౌరీ దేవి (పార్వతి).
చతుర్థి: విఘ్నాల తొలగింపు, విజయం కోసం వినాయకుడు.
పంచమి: సంతాన ప్రాప్తి, కుజదోష నివారణకై నాగదేవత.
షష్ఠి: శత్రు జయం, ధైర్యం, దోష వినాశనానికి కుమారస్వామి.
సప్తమి: ఆరోగ్య సిద్ధి, కంటి సమస్యల నివారణకై సూర్యుడు
అష్టమి: భయ నివారణ, రక్షణ కోసం దుర్గాదేవి.