News May 8, 2024
అంబానీ, అదానీ గురించి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు?: మోదీ

TG: ఇన్నాళ్లూ అంబానీ, అదానీ అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎందుకు వాళ్ల గురించి మాట్లాడటం లేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘ఆ యువరాజు(రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) పొద్దున లేస్తే అంబానీ, అదానీ అని మాట్లాడేవాడు. మరి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నాడు. వారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత తీసుకుంది? గుట్టలకొద్దీ డబ్బుల కట్టల గురించి ఆ పార్టీ సమాధానం చెప్పాలి’ అని మోదీ డిమాండ్ చేశారు.
Similar News
News January 30, 2026
టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం: CBN

AP: కుప్పాన్ని ప్రయోగశాలగా చూస్తానని, అన్ని రకాల టెక్నాలజీలను ఇక్కడికి తెస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. స్థానిక ఆగస్త్య అకాడమీలో విద్యార్థులతో CBN మాట్లాడారు. ‘భవిష్యత్తులో భారతదేశం ఎలా ఉండబోతోందో విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. ప్రపంచంలో నెలకొంటున్న పరిణామాలను అందిపుచ్చుకోవాలి’ అని సూచించారు. విద్యుత్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయని, విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గించామని తెలిపారు.
News January 30, 2026
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు జకోవిచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్లో జకోవిచ్ అద్భుతమైన విజయం సాధించారు. డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్‌తో జరిగిన 5 సెట్ల హోరాహోరీ పోరులో 3-6, 6-3, 4-6, 6-4, 6-4 తేడాతో గెలుపొందారు. రెండేళ్ల తర్వాత సిన్నర్‌పై విజయం సాధించిన జకోవిచ్.. కెరీర్‌లో 11వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరగనున్న తుది పోరులో ప్రపంచ నంబర్ 1 కార్లోస్ అల్కరాజ్‌తో తలపడనున్నారు.
News January 30, 2026
ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి, గోల్డ్ రేటు భారీ పతనం

విపరీతంగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ <<19003989>>పతనమయ్యాయి<<>>. ఇది క్రమంగా కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఫ్యూచర్ ట్రేడింగ్(MAR)లో KG వెండి రేటు ₹67,891 తగ్గి(16.97%) ₹3.32 లక్షలకు చేరింది. గోల్డ్ కూడా(FEB) 10 గ్రాములు ₹15,246 తగ్గి(9%) ₹1,54,157 పలికింది.
* భవిష్యత్తులో ఓ తేదీన ముందుగా నిర్ణయించిన ధరకు స్టాక్స్/కమోడిటీల కొనుగోలు లేదా విక్రయానికి చేసుకునే ఒప్పందాన్ని ఫ్యూచర్ ట్రేడింగ్ అంటారు.


