News March 28, 2026

లోక్ అదాలత్‌తో కేసుల శాశ్వత పరిష్కారం: జడ్జి హర్ష

image

పరస్పర రాజీతోనే కోర్టు కేసులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మొదటి అదనపు జిల్లా జడ్జి హర్ష అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి దుర్గా ప్రసాద్, బార్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, అదనపు సీపీ బస్వారెడ్డి, అదనపు కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Similar News

News April 20, 2026

నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

image

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News April 20, 2026

బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

image

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.