News March 28, 2026

16ఏళ్లలోపు పిల్లలకు ఇండోనేషియాలో SM బ్యాన్!

image

పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేందుకు ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి దేశంలో 16ఏళ్లలోపు పిల్లలు SM వాడకంపై నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో యూట్యూబ్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 16ఏళ్లలోపు పిల్లలు అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. ఆస్ట్రేలియా తర్వాత ఈ తరహా కఠిన చట్టాన్ని తెచ్చిన దేశంగా ఇండోనేషియా నిలిచింది.

Similar News

News April 18, 2026

‘పదహారణాల’ తెలుగమ్మాయి అంటే?

image

అచ్చమైన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తే పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం. ఒక కంప్లీట్ ఉమెన్ అని అర్థం. పూర్వం 16 అణాలు కలిస్తే ఒక పూర్తి రూపాయి. తన భాష, భావన, నడక, నడత, ఆహార్యం, వస్త్ర ధారణ తదితర 16 అంశాల్లో తెలుగుదనాన్ని నింపుకున్న అమ్మాయిని మన కవులు ఇలా పోల్చారు.
* ఒక బేడా= 2 అణాలు. ఒక పరకా=1/2 అణా, ఒక కాని=1/4 అణా, ఒక దమ్మిడి= 1/12 అణా.
<<-se>>#EPICSAYINGS<<>>

News April 18, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షం కురుస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట్, నాంపల్లి, అబిడ్స్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, చార్మినార్, అల్వాల్, కాప్రా, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని తెలిపారు. అటు సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షం పడుతుందని పేర్కొన్నారు.

News April 18, 2026

డీఏ పెంపుతో జీతం ఎంత పెరుగుతుంది?

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం <<19682000>>డీఏ పెంపుతో<<>> కరవు భత్యం 60 శాతానికి చేరింది. దీంతో జీతం ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్ శాలరీ రూ.30,000 ఉంటే 58 శాతం డీఏకు రూ.17.400, 60 శాతం డీఏకు రూ.18,000 వస్తుంది. అంటే ప్రతి రూ.30వేలకు రూ.600 అధికమవుతుంది. ఇక పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. అరియర్స్‌ను వచ్చే 3 నెలల జీతంతో కలిపి ఇచ్చే అవకాశం ఉంది.