News March 28, 2026

విద్యుత్ కష్టాలకు చెక్.. 296 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో వేసవిలో అంతరాయం లేని విద్యుత్తును అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్ఈ శ్రీనివాస చారి తెలిపారు. ఇందుకోసం 296 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 10 సబ్ స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచామన్నారు. అత్యవసర సమయాల్లో ప్రత్యామ్నాయ సరఫరా కోసం ఇంటర్‌లింకింగ్ వ్యవస్థను సిద్ధం చేశామని, ఫిర్యాదుల కోసం 1912 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.