News May 8, 2024

నిలిచిన నీరు.. రంగంలోకి GHMC ఉన్నతాధికారులు

image

HYDలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పలుచోట్ల కనీసం రోడ్లపై నడవలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ రంగంలోకి దిగారు. నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, త్వరత్వరగా చర్యలు చేపట్టాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News September 13, 2025

HYD: PM నేతృత్వంలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత: కిషన్ రెడ్డి

image

హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. PM నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుర్వేదానికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగిందన్నారు. వేల సంవత్సరాల క్రితం నుంచే అనేక వైద్య సమస్యలకు ఆయుర్వేదం పరిష్కారం చూపిందని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి, ప్రపంచస్థాయిలో అవగాహన కోసం కేంద్రం వివిధ చర్యలు చేపడుతోందని వివరించారు.

News September 13, 2025

HYD: ట్రాఫిక్ అలర్ట్.. రేపు ఈ రోడ్లు బంద్..!(2/2)

image

HYDలోని మిర్ ఆలం మండి, ఏతెబార్ చౌక్, అలీజాహ్ కోట్లా, బీబీ బజార్, వోల్టా హోటల్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎమ్.జే.మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నంపల్లి టీ జంక్షన్, హాజ్ హౌస్, ఏ.ఆర్.పెట్రోల్ పంప్, నాంపల్లి జంక్షన్ మార్గాల్లో రేపు ట్రాఫిక్ డైవర్షన్ అమలు కానుంది. వాహనాల రాకపోకలు నిలిపివేత కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.

News September 13, 2025

HYD: ALERT.. రేపు ట్రాఫిక్ డైవర్షన్ (1/2)

image

SEP 14న ఉ.8 నుంచి రా.8 వరకు HYDలో ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని HYD పోలీసులు తెలిపారు. ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి, నాగుల్‌చింత క్రాస్ రోడ్, హిమ్మత్‌పురా జంక్షన్, వోల్గా, హరిబౌలి, పంచ్ మోహల్లా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్‌గట్టి, మదీనా జంక్షన్, డెల్హీ గేట్, నాయాపూల్, ఎస్.జె.రోటరీ జంక్షన్, దారుల్‌షిఫా, పూరాణీ హవెలీలో రోడ్డు బంద్, డైవర్షన్ కొనసాగుతుంది.