News March 29, 2026
కడప జిల్లా అభివృద్ధికి సమన్వయం అవసరం: కలెక్టర్

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. శనివారం కడపలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయం, తాగునీటి అవసరాలకు సరిపడా వనరులు ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


