News May 8, 2024
మీ మిషన్‌కు మద్దతుగా నిలుస్తాం పవన్: నరేశ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు కొనసాగుతోంది. తాజాగా సీనియర్ నటుడు నరేశ్ ట్విటర్ వేదికగా జనసేనకు మద్దతు ప్రకటించారు. ‘ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతున్నా. మీ ప్రయాణం ఓ ఆశాద్వీపం. మీ మిషన్‌కు మద్దతుగా నిలుస్తాం. మీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్’ అని పేర్కొన్నారు.
Similar News
News February 20, 2026
ఇండియాలో లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది: రషీద్ ఖాన్

T20 WCలో ప్రేక్షకుల మద్దతుకు అఫ్గాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ‘ఇండియాలో మాకు లభించిన ప్రేమ గుర్తుండిపోతుంది. అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీలో మ్యాచ్‌లకు భారీ సంఖ్యలో వచ్చారు. మేం అఫ్గాన్‌లో మా సొంత ప్రేక్షకుల ముందు ఆడుతున్నట్లు అనిపించింది. మైదానంలోనే కాదు.. ఎక్కడికెళ్లినా ప్రేమ లభించింది. మాకు మద్దతు కొనసాగించండి’ అని కెనడాతో మ్యాచ్ అనంతరం చెప్పారు.
స్కోర్లు: AFG:200/4, CAN: 118/8
News February 20, 2026
ఫిబ్రవరి 20: చరిత్రలో ఈ రోజు

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం (ఫొటోలో)
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
News February 20, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


