News May 8, 2024

FREEగా టీ20 వరల్డ్ కప్ చూడొచ్చు

image

క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా ప్రసారం చేయనుంది. ఇండియాలోని యూజర్లు మొబైల్‌ వెర్షన్‌లో దీన్ని ఉచితంగా ఆస్వాదించవచ్చు. గత వన్డే వరల్డ్ కప్‌తో పాటు ఆసియా కప్‌ను సైతం ఉచితంగా ప్రసారం చేయగా.. రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

Similar News

News February 13, 2026

నల్గొండలో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీజేపీ ఆధిక్యం

image

TG: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 48 డివిజన్లలో ఇప్పటివరకు లెక్కింపు పూర్తయిన వాటిలో పదింటిని హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మరో 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. మరోపక్క ఇక్కడ BRS, BJPలు పలు డివిజన్లలో బాగా వెనుకబడి ఉన్నాయి. అటు కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉండగా BJP 28, కాంగ్రెస్ 19, BRS 13, ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.

News February 13, 2026

వివిధ పంటల్లో తెగుళ్లు- నివారణకు సూచనలు

image

☛ మిరప, టమాటా, చిక్కుడు, ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు లీటరు నీటికి కార్బండిజం 1గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా కలిపి పిచికారీ చేయాలి. ☛ బీర, కాకర, దోస, పొట్ల, సొరలో బూజుతెగులు నివారణకు లీటరు నీటికి డైమెథోమోర్ఫ్ 1.5గ్రా. కలిపి పిచికారీ చేసుకోవాలి. ☛ టమాటా, వంగ, క్యాప్సికంలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా.+ప్లాంటామైసిస్ 2గ్రా కలిపి పిచికారీ చేయాలి.

News February 13, 2026

ముత్యం ఉంగరం ధరిస్తే?

image

ముత్యం చంద్ర గ్రహానికి ప్రతినిధి. ఇది మనస్సును భావోద్వేగాలను శాంతంగా ఉంచుతుంది. మేష, కర్కాటక, వృశ్చిక, మీన రాశుల వారు ముత్యం ధరించాలని జ్యోతిషులు సూచిస్తున్నారు. దీనివల్ల రాజయోగం పడుతుందని చెబుతున్నారు. ‘ఇది కోపాన్ని తగ్గించి, మానసిక స్పష్టతను, సంపదను ప్రసాదిస్తుంది. ముత్యాన్ని వెండి ఉంగరంలో పొదిగి, సోమవారం నాడు కుడిచేతి చిటికెన వేలికి ధరిస్తే ఆరోగ్య, ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది’ అంటున్నారు.