News March 29, 2026
RCB సూపర్ రికార్డ్

ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో SRHపై <<19504011>>ఘన విజయం<<>> సాధించిన RCB ఓ సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. టోర్నీ హిస్టరీలోనే 200+ రన్స్‌ను అతి తక్కువ ఓవర్ల(15.4)లో ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో RR(15.5 ఓవర్లు) vsGT, RCB(16 ఓవర్లు) vsGT, MI(16.3 ఓవర్లు) vsRCB, DC(17.3 ఓవర్లు) vsGL ఉన్నాయి.
Similar News
News April 11, 2026
కాశీలో శని దోషాలు పోగొట్టే ఆలయం

కాశీలో విశ్వేశ్వరుడు, విశాలాక్షి దేవి ఆలయాలతో పాటు అన్నపూర్ణాదేవి గుడి కూడా ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే ఆహారానికి లోటుండదని నమ్మకం. అలాగే సంకట మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శిస్తే సంకటాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామి దర్శనంతో ఏలినాటి శని దోషాలు పోతాయని అంటున్నారు. భక్తులు మణికర్ణికా, దశాశ్వమేధ ఘాట్‌లు దర్శించి గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.
News April 11, 2026
డీల్ కుదరకపోతే.. అమెరికా ప్లాన్-B ఏంటి?

ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమైతే అమెరికా ప్లాన్-Bతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోసారి పెద్ద ఎత్తున దాడి చేసేందుకు ప్రణాళికలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పశ్చిమాసియాలో ఆయుధాలు, బలగాలను మోహరిస్తున్నట్లు టాక్. ట్రంప్ సైతం ఆ దిశగా హింట్ ఇచ్చారు. నౌకలను ఆయుధాలతో లోడ్ చేస్తున్నామని హెచ్చరించారు. దీంతో ఓవైపు దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తూనే దాడులకూ అగ్రరాజ్యం సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
News April 11, 2026
రేపు మధ్యాహ్నంలోపు ఇంటర్ ఫలితాలు!

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు మధ్యాహ్నంలోపు విడుదలయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రిజల్ట్స్‌ను విడుదల చేయనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని ఆయన హైదరాబాద్ బయల్దేరారు. ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించి ఈ సాయంత్రం ఫలితాల విడుదల సమయాన్ని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఫలితాలను రేపు ఒక్క క్లిక్‌తో Way2Newsలో తెలుసుకోండి.


