News March 30, 2026

ఈనాటి ముఖ్యాంశాలు

image

* సంక్షోభం వేళ స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దు: మోదీ
* IPL: KKRపై MI ఘన విజయం
* హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి: CBN
* క్రెడిట్ చోరీ జబ్బు నుంచి జగన్ కోలుకోవాలి: లోకేశ్
* నటనతో మెప్పించిన TG MLA, MLCలు
* పొంగులేటిని బర్తరఫ్ చేయాల్సిందే: కేటీఆర్
* ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు TG అసెంబ్లీ ఆమోదం
* BJP వస్తే మాంసం, గుడ్లు తిననివ్వదు: మమతా బెనర్జీ

Similar News

News April 12, 2026

చర్చలు ఫెయిల్ కావడానికి కారణాలు ఇవేనా..?

image

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. దీనికి న్యూక్లియర్ డీల్ ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని, భవిష్యత్‍‌లో దానిపై పరిశోధనలు చేయవద్దని అమెరికా సూచించగా ఇరాన్ తలొగ్గలేదు. అలాగే హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకూ నో చెప్పింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ కోరగా అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయింది.

News April 12, 2026

ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే..?

image

వేసవిలో ఉష్ణోగ్రత 35-40 డిగ్రీల వరకు ఉంటే బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తల తిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 40-45 డిగ్రీలకు చేరుకుంటే ప్రమాద స్థాయి పెరుగుతుంది. వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. 45 డిగ్రీలు దాటితే వడదెబ్బతో ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. పగటి వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అత్యవసరం అయితే గొడుగు లేదా టోపీ వాడాలి. కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.

News April 12, 2026

చర్చలు ఫెయిల్.. పాక్ కొంప మునిగినట్లేనా?

image

US-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమవ్వడంతో పాక్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి ఇక కష్టకాలమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అటు అఫ్గాన్‌తో ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతుండగా ఇప్పుడు పశ్చిమ సరిహద్దు కూడా రగిలిపోయే ఛాన్స్ ఉంది. సౌదీతో ఉన్న రక్షణ ఒప్పందం వల్ల పాక్ యుద్ధంలోకి దిగాల్సి రావచ్చు. ఒకవేళ US తన ఎయిర్‌బేస్‌లను అడిగితే కాదనలేక, అలాగని ఇరాన్‌ను ఎదిరించలేక పాక్ ప్రాణసంకటంలో పడటం ఖాయం!