News May 8, 2024
HYDలో 11 మందిని బలితీసుకొన్న గాలివాన

HYDలో నిన్న కురిసిన గాలివాన 11 మందిని బలితీసుకొంది. బహదూర్‌పురాలో కరెంట్ పోల్ తగిలి షాక్‌తో ఫక్రూ(40) చనిపోయారు. బేగంపేట నాలాలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. బాచుపల్లిలో గోడకూలి ఏకంగా ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అబ్దుల్లాపూర్‌మెట్‌లో పంక్చర్ షాప్‌లో ఉన్న వ్యక్తి కరెంట్ షాక్‌తో చనిపోయారు. అకాల వర్షానికి ఒక్కరోజే 11 మంది చనిపోవడం HYDలో ఇదే తొలిసారి.
Similar News
News September 13, 2025
HYD: PM నేతృత్వంలో ఆయుర్వేదానికి ప్రాధాన్యత: కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. PM నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయుర్వేదానికి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత పెరిగిందన్నారు. వేల సంవత్సరాల క్రితం నుంచే అనేక వైద్య సమస్యలకు ఆయుర్వేదం పరిష్కారం చూపిందని తెలిపారు. పరిశోధన, అభివృద్ధి, ప్రపంచస్థాయిలో అవగాహన కోసం కేంద్రం వివిధ చర్యలు చేపడుతోందని వివరించారు.
News September 13, 2025
HYD: ట్రాఫిక్ అలర్ట్.. రేపు ఈ రోడ్లు బంద్..!(2/2)

HYDలోని మిర్ ఆలం మండి, ఏతెబార్ చౌక్, అలీజాహ్ కోట్లా, బీబీ బజార్, వోల్టా హోటల్, అఫ్జల్ గంజ్ టీ జంక్షన్, ఉస్మాన్ గంజ్, ఎమ్.జే.మార్కెట్ జంక్షన్, తాజ్ ఐలాండ్, నంపల్లి టీ జంక్షన్, హాజ్ హౌస్, ఏ.ఆర్.పెట్రోల్ పంప్, నాంపల్లి జంక్షన్ మార్గాల్లో రేపు ట్రాఫిక్ డైవర్షన్ అమలు కానుంది. వాహనాల రాకపోకలు నిలిపివేత కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.
News September 13, 2025
HYD: ALERT.. రేపు ట్రాఫిక్ డైవర్షన్ (1/2)

SEP 14న ఉ.8 నుంచి రా.8 వరకు HYDలో ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటుందని HYD పోలీసులు తెలిపారు. ఫలక్‌నుమా, ఇంజిన్ బౌలి, నాగుల్‌చింత క్రాస్ రోడ్, హిమ్మత్‌పురా జంక్షన్, వోల్గా, హరిబౌలి, పంచ్ మోహల్లా, చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తర్‌గట్టి, మదీనా జంక్షన్, డెల్హీ గేట్, నాయాపూల్, ఎస్.జె.రోటరీ జంక్షన్, దారుల్‌షిఫా, పూరాణీ హవెలీలో రోడ్డు బంద్, డైవర్షన్ కొనసాగుతుంది.