News May 8, 2024
ఏపీకి బుల్లెట్ రైలు కావాలా? వద్దా?: మోదీ
ఏపీకి బుల్లెట్ రైలు కావాలా? వద్దా? అని ప్రధాని మోదీ పీలేరు సభలో ప్రజలను ప్రశ్నించారు. ‘దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం. కడప ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహిస్తాం. టమాటా నిల్వ చేసేందుకు భారీగా గిడ్డంగులు ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం కూటమి తరఫున పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కోరారు.
Similar News
News January 7, 2025
కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30కు తీర్పు వెల్లడించనుంది. క్వాష్ పిటిషన్‌పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
News January 7, 2025
టెంబా బవుమా సరికొత్త రికార్డ్
సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా సరికొత్త ఘనత సాధించారు. తొలి 9 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన నాలుగో కెప్టెన్‌గా బవుమా నిలిచారు. ఇప్పటివరకు తన సారథ్యంలో 9 టెస్టులు ఆడి వరుసగా 8 గెలుపొందగా, ఒకటి డ్రా చేసుకున్నారు. పాకిస్థాన్‌పై విజయంతో ఈ ఫీట్ సాధించారు. పెర్సీ చాప్‌మన్ (ENG) తొలి తొమ్మిది మ్యాచులనూ గెలిపించారు. ఆ తర్వాత వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (8 AUS), లిండ్సే హస్సెట్ (8 AUS) ఉన్నారు.
News January 7, 2025
కెనడా PM రేసులో భారత సంతతి వ్యక్తులు!
పీఎంగా జస్టిస్ ట్రూడో తప్పుకోవడంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనే చర్చ మొదలైంది. రేసులో పలువురు లిబరల్ పార్టీ నేతలతో పాటు భారత సంతతికి చెందిన అనితా ఆనంద్, జార్జ్ చాహల్ ఉన్నారు. అనిత ట్రూడో క్యాబినెట్‌లో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆమె పేరెంట్స్ తమిళనాడు, పంజాబ్‌కు చెందినవారు. ఇక చాహల్ లిబరల్ పార్టీలో, అక్కడి సిక్కు కమ్యూనిటీలో కీలక నేతగా ఉన్నారు. ట్రూడో గద్దె దిగడంలో కీలకపాత్ర పోషించారు.