News March 30, 2026
వరంగల్: స్కూల్స్‌లో అత్యవసర ఫోన్ నంబర్ల బోర్డులు!

సర్కారు బడుల్లో అత్యవసర ఫోన్ నంబర్ల బోర్డుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.12.66 లక్షలు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలోని 2,533 పాఠశాలలకు ఓక్కో స్కూల్‌కు రూ.500 కేటాయించింది. ఈ బోర్డులో హాస్పిటల్, పోలీసు, ఫైర్, MEO, DEO, కలెక్టర్, HM నంబర్లు ఉంటాయి. HNKలో 333 పాఠశాలలకు రూ.1,66,500, WGL-404కు రూ.2,02,000, ములుగు-375కు రూ.187500, MHBD-739కు రూ.369500, జనగామ-345JI రూ.172500, BHPL-337కు రూ.168500 మంజూరయ్యాయి.
Similar News
News April 5, 2026
నేడు ఒంటిమిట్ట రామయ్యకు పుష్పయాగం

ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగియడంతో నేడు(ఆదివారం) రాత్రి రామాలయంలో వేదపండితులు, అర్చకులు సంప్రదాయంగా పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించనున్నారు. ఆలయంలోని దక్షిణ ఈశాన్య మూల ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన ప్రత్యేక చినపుష్పాలతో ఈ కార్యక్రమాన్ని వేడుకగా జరిపించనున్నారు.
News April 5, 2026
శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
News April 5, 2026
రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>


