News March 30, 2026
గార: రాజులమ్మ జాతరకు వెళ్తుండగా ప్రమాదం.. మహిళ మృతి

గార మండలం తండ్యాల పేట వద్ద బైకు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కింద పడి మహిళ మృతి చెందింది. జి.సిగడాం మండలానికి చెందిన ముగడ కనకమ్మ(51) తన కుమారుడు కవిలేష్ తో కలిసి ద్విచక్ర వాహనంపై వత్స వలస గ్రామంలోని రాజులమ్మ జాతరకు ఆదివారం బయలుదేరారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి బైక్ అదుపుతప్పి పడిపోయారు. అదే సమయంలో కనకమ్మ బస్సు వెనక చక్రాల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందింది. కేసు నమోదయింది.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.