News March 30, 2026

సిరిసిల్ల: త్వరలో చేనేత సహకార ఎన్నికలు..!

image

రాష్ట్రంలో చేనేత సహకార ఎన్నికల నిర్వాహణకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, బకాయిదారుల వివరాలను ఏప్రిల్ 4-13 వరకు నోటీసుపై ప్రచురించనున్నారు. ఓటు హక్కు కావాలనుకుంటే వచ్చేనెల 13లోగా బకాయిలు చెల్లించాలని గడువు విధించారు. అదేనెల 18-25 వరకు ఓటరు జాబితా విడుదల చేస్తారు. జూన్‌లో చేనేత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 6, 2026

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి: SP

image

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో SP జి.బిందు మాధవ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అందిన 24 ఫిర్యాదులను ఆయన స్వయంగా స్వీకరించారు. వీటిలో 7 భూ తగాదాలు, 9 కుటుంబ కలహాలు, 8 ఇతర సమస్యలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించిన SP, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News April 6, 2026

అన్నమయ్య జిల్లాలో దారుణ హత్య

image

అన్నమయ్య (D) చౌడేపల్లి (M) బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టినట్లు పుంగనూరు రూరల్ CI సాయి ప్రసాద్, SI చిన్నరెడ్డప్పలు తెలిపారు.

News April 6, 2026

వసతి గృహాలకు వాటర్ ప్యూరిఫైర్ల పంపిణీ

image

సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు సీఎస్ఆర్ నిధులతో సమకూర్చిన నాలుగు వాటర్ ప్యూరిఫైర్లను సోమవారం ఆయన ప్రారంభించారు. వీటిని కదిరి ప్రాంతంలోని మూడు బీసీ, ఒక ఎస్సీ హాస్టళ్లకు పంపిణీ చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.