News March 30, 2026

ప్రకాశ్‌రాజ్ తల్లి కన్నుమూత

image

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ తల్లి సువర్ణలత(86) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని తన ఇంట్లోనే ఆమె తుదిశ్వాస విడిచారు. సాయంత్రం సువర్ణలత అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Similar News

News April 13, 2026

కొత్త ఎల్పీజీ కనెక్షన్ల మంజూరు నిలిపివేత

image

TG: LPG సరఫరాలో సమస్యతో గృహ, వాణిజ్య అవసరాల కోసం ఇచ్చే కొత్త కనెక్షన్ల మంజూరును ఆయిల్ కంపెనీలు నిలిపేశాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియనూ ఆపేశాయి. ఇప్పటికే అందిన అప్లికేషన్లను సైతం పెండింగ్ పెట్టాయి. ‘మహాలక్ష్మి’ స్కీమ్ దరఖాస్తులదీ అదే స్థితి. కంపెనీలు ఆమోదించకపోతుండడంతో GOVT కూడా వీటిని ఆపేసింది. ఇరాన్-US యుద్ధంతో గ్యాస్ కొరత ఏర్పడటమే ఈ పరిస్థితికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.

News April 13, 2026

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..

image

TGTET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15-30 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 9 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. JUNE 15-30 మధ్య ఎగ్జామ్స్ జరుగుతాయి. ఉ.9-11.30, మ.2 – సా.4.30 గంటల వరకు 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. జులై 28-31 మధ్య ఫలితాలు వెల్లడిస్తారు. Gen, BCలకు ఒక పేపరుకు రూ.750, 2 పేపర్లకు రూ.1000, SC, ST, PwD అభ్యర్థులకు ఒక పేపరుకు రూ.700, 2 పేపర్లకు 950గా నిర్ణయించారు.

News April 13, 2026

అదే జరిగితే.. 150 డాలర్లకు క్రూడాయిల్?

image

అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమవడంతో క్రూడాయిల్ ధర మళ్లీ 100 డాలర్లు దాటింది. ట్రంప్ <<19635574>>హెచ్చరించినట్లుగా<<>> హార్ముజ్‌ను పూర్తిగా దిగ్బంధిస్తే చమురు ధర 150 డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే ఇరాన్‌కు టోల్ చెల్లించే నౌకలను హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించకుండా అడ్డుకుంటామని ట్రంప్ చెప్పారు. ఇది అమల్లోకి వస్తే రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ సరఫరాకు ఇబ్బందులు వస్తాయని అంచనా.