News March 30, 2026
శ్రీకాకుళం: ‘వేసవిలో పరిశ్రమలు అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి’

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కె.రాంబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మా, రసాయన పరిశ్రమలోని రియాక్టర్లు, స్టోరేజ్ ట్యాంకుల వద్ద ఉష్ణోగ్రతలు పెరగకుండా శీతలీకరణ వ్యవస్థలు నిరంతరం పనిచేసేలా చూడాలని యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.