News March 30, 2026
GWL: ‘ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి’

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 85 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అట్టి ఫిర్యాదులను పరిష్కరించని అధికారులకు మెమోలు జారీ చేస్తామన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన సమస్యలపై సంబంధిత అధికారులు దృష్టి కేంద్రీకరించాలన్నారు.
Similar News
News April 19, 2026
ఖమ్మం: హారన్ కొట్టారని.. కండక్టర్‌పై యువకుడి దాడి

రహదారిపై వెళ్తుండగా సైడ్ ఇవ్వాలని హారన్ కొట్టినందుకు ఓ యువకుడు ఏకంగా ఆర్టీసీ బస్సునే అడ్డుకుని హల్‌చల్ చేశాడు. నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. డ్రైవర్ రాంబాబుతో వాగ్వివాదానికి దిగిన సదరు యువకుడు, కండక్టర్ మంజుల ఫోన్ లాక్కొని దురుసుగా ప్రవర్తించాడు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యం చేసిన నిందితుడిని నేలకొండపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News April 19, 2026
వీళ్లు ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగొద్దు!

ఉదయాన్నే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు ఉన్నవారు నీళ్లు అధికంగా తాగితే ఆయా అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి కడుపులో ఇబ్బంది కలగొచ్చు. ఒంట్లో నీరు చేరి వాపులు వచ్చే వారు కూడా వైద్యుల సలహా మేరకే నీటిని తీసుకోవాలి.
News April 19, 2026
MGU: పరీక్షల షెడ్యూల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో బీటెక్ పరీక్షల షెడ్యూల్‌ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సెమిస్టర్-2, 4 (రెగ్యులర్ & బ్యాక్ లాగ్), సెమిస్టర్-1,3 (బ్యాక్ లాగ్) పరీక్షలు మే-5 నుంచి మే-21 మధ్య జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. టైం టేబుల్స్‌ను అధికారక ఎంజీయూ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.


