News March 30, 2026
శ్రీకాకుళం జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో 1112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో పీఎం ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహాన్ని సోమవారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలసి ఆయన గృహ ప్రవేశం చేసి మాట్లాడారు. ఈ ఇల్లు మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా, మీ కుటుంబానికి భద్రతగా ఉండాలన్నారు. మీ జీవితాల్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి తీసుకురావాలన్నారు.
Similar News
News April 20, 2026
శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్లైన్లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.