News March 30, 2026

ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చుదాం: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘అంతర్జాతీయ జీరో వేస్ట్ డే’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల వన్యప్రాణులకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని, పునర్వినియోగ వస్తువులనే వాడాలని సూచించారు

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.