News March 30, 2026

SKLM:’ CM ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం దిక్సూచిగా మారింది’

image

దేశంలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత దూరదృష్టితో ప్రవేశపెట్టిన ‘పి4’ కార్యక్రమం పేదరిక నిర్మూలనకు దిక్సూచిగా మారిందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో ‘పి4’ కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా, ఉత్తమసేవలు అందించిన ‘మార్గదర్శులకు’ సన్మానం చేశారు. 20% కుటుంబాలకు సంపన్న పౌరులు ఆర్థికసాయం అందించారన్నారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.