News May 8, 2024

ఆదిలాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్

image

ఆదిలాబాద్ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉట్నూర్‌కి చెందిన ఓ యువతి ఈ నెల 4న ఇంటికి వెళ్తానని ప్రిన్సిపల్‌కి సెలవు పత్రం ఇచ్చి కాలేజీ నుంచి బయటికి వచ్చింది. అయితే బుధవారం ఆమె తండ్రి తనను చూడడానికి కాలేజీకి వెళ్లడంతో విషయం బయటపడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ CI అశోక్ తెలిపారు.

Similar News

News January 18, 2025

‘రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి’

image

 రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జట్టుకు శనివారం  క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. 

News January 18, 2025

ఈ యాప్‌తో నిరుద్యోగులకు ఎంతో మేలు: కలెక్టర్

image

నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్‌లో కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అధికారులు ఈ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. డైట్ యాప్‌లో తమ విద్యార్హతలతో పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని చెప్పారు.

News January 18, 2025

నిర్మల్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడి దారుణహత్య

image

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. చిట్యాలలో 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి (12) కల్లు బట్టిలో పనిచేస్తున్నాడు. కాగా గ్రామ శివారులోని చింతలచెరువు సమీపంలో రిషి మర్మంగాలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఇవాళ బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు రిషి మృతదేహన్ని గుర్తించి నిర్మల్ పోలీసులకు సమాచారం అందించారు.