News May 8, 2024
అనారోగ్యంతో ఏఎస్సై మృతి

రంపచోడవరం నియోజకవర్గం చింతూరులో ఏఎస్సైగా పని చేస్తున్న ఎన్.కుశలన్నదొర అనారోగ్యంతో మృతి చెందారని ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. కొన్ని రోజుల క్రితం విధి నిర్వహణలో ఉండగా… ఆయనకు ఫీట్స్ వచ్చి అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి కాకినాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. ఆయన స్వగ్రామం గంగవరం మండలం లొద్దిపాలెం అని తెలిపారు.
Similar News
News April 22, 2025
కొవ్వూరు: ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య

కొవ్వూరు మండలంలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణానికి చెందిన వాలిశెట్టి రాంబాబు(54) ఉరివేసుకున్నారు. దొమ్మేరుకి చెందిన వరలక్ష్మి ఈనెల 20న 40మాత్రలు మింగిడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదులతో రెండు ఘటనలపై పట్టణ పోలీసులు విడివిడిగా కేసులు నమోదు చేశారు.
News April 22, 2025
రాజమండ్రి: సప్లమెంటరీ పరీక్షల ఫీజు గడువు ముగింపు

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లింపునకు మంగళవారంతో గడువు ముగియనుందని ఆర్ఐవో నరసింహం తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇకపై గడువు పొడిగించబడదన్నారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఫీజు చెల్లింపునకు నేటితో గడువు ముగియనుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులు సాయంత్రం 4గంటలలోగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.
News April 22, 2025
RJY: పోలీస్ సిబ్బందికి డ్రోన్ కెమెరాపై శిక్షణ

తూర్పుగోదావరి జిల్లాలో ఇకపై సాంకేతికత, అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు వినూత్న చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాల ఆపరేటింగ్‌పై సిబ్బందికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.