News May 8, 2024

ఖమ్మం: ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి ఘటన బుధవారం కారేపల్లి మండలం పోలంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.రాజా రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకి చెందిన ముళ్లపాటి శ్రీనివాస్(55) పోలంపల్లి సమీపంలో ఇటుక బట్టి నిర్వహిస్తున్నాడు. ట్రాక్టర్ తీసుకొని ఇంటికి వెళుతుండగా పోలంపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News October 2, 2024

రేపటి నుంచి ఈ రైళ్లు పునః ప్రారంభం

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో గత నెలలో తాత్కాలికంగా నిలిపివేసిన రైళ్లను ఈనెల 3 నుంచి పునః ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020/11019), ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (12706/12705) భద్రాచలం రోడ్ ప్యాసింజర్ పునః ప్రారంభం ఎక్స్‌ప్రెస్ చెప్పారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News October 2, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక ప్రజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News October 2, 2024

ఖమ్మం: నేడు గాంధీ జయంతి.. ఈ దుకాణాలు బంద్

image

నేడు గాంధీ జయంతి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చికెన్, మటన్, ఫిష్, వైన్ షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు బెల్టు షాపులు, మరోవైపు మాంసం దుకాణాలు దొంగచాటుగా మద్యం, మాంసాన్ని ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశాలున్నాయి.