News May 9, 2024

ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అప్రమత్తంగా వ్యవహరించాలి: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలు అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున అన్నారు ఎన్నికల సన్నద్ధత సమావేశంలో భాగంగా ఆయన బుధవారం కలెక్టరేట్ సమావేశంలో ఆర్వోలతో సమావేశం అయ్యారు. సెక్టోరల్, రూట్ అధికారులతో సమన్వయం వహించాలని పోలింగ్ కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించాలని, ఈవీఎంల తరలింపు అంశాలపై సూచనలు చేశారు.

Similar News

News October 23, 2025

విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News October 23, 2025

మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: జేసీ

image

బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసి మయూర్ అశోక్ తెలిపారు. గురువారం విశాఖ కలెక్టరేట్‌లో మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. క్వాలిటీ, క్వాంటిటీల్లో రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నరా అని తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.

News October 23, 2025

తాడేపల్లి కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర: టీడీపీ

image

గాజువాకలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర జరిగిందని, జోగి రమేష్ – జనార్ధన్‌రావుల ప్రమేయంతోనే కల్తీ తయారైందని పల్లా ఆరోపించారు. ఏపీ సురక్షా యాప్‌ను లాంచ్ చేసి, కల్తీని అరికట్టేందుకు QR కోడ్ విధానం, 13 రకాల టెస్టులు ప్రవేశపెట్టామని చెప్పారు.